కోమటిపల్లిలో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

కోమటిపల్లిలో ఉద్రిక్తత

Nov 28 2026 1:38 AM | Updated on Nov 28 2026 1:38 AM

బొబ్బిలిరూరల్‌:

కోమటిపల్లిలో పంచాయతీ సర్పంచ్‌ ఎన్నికల ఫలితాలు హింసాత్మకంగా ముగిసాయి. అధికార పార్టీ దౌర్జన్యాలకు, దాడులకు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు బాధితులయ్యారు. దెబ్బలు తిన్నారు. పరుగు తీశారు. అయినా వదలకుండా వందలాది మంది మూకమ్మడిగా తమపై దాడిచేశారని, పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని బాధితులు వాపోతున్నారు. గురువారం రాత్రి కోమటిపల్లి జెడ్పీహెచ్‌ స్కూల్‌లో జరిగిన ఘటనపై పోలీసుల తీరుకు నిరసనగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాధితులు శుక్రవారం రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. రహదారికి అడ్డంగా రిక్షాలు, కర్రలు పెట్టి వాహనాలను అడ్డుకుని రాస్తారోకో చేశారు. వివరాల్లోకి వెళితే.... కోమటిపల్లి సర్పంచ్‌ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారు గొట్టాపు సత్యనారాయణ విజయం సాధించారు. అప్పటికీ శాంతించకుండా గొడవలకు ఉసిగొలిపారు. లెక్కింపు ఏజెంటుగా వెళ్లిన పాస్టర్‌ బోనెల సంపత్‌(బుజ్జి)పై దాడిచేయించారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన పెంకి అభిషేక్‌, అజయ్‌తేజ, చింతాడ రఘలపై కూడా పిడిగుద్దులు కురిపించారు. పోలీసుల ముందే ఘటన జరిగినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. వైద్యం కోసం సీహెచ్‌సీకి వెళ్తే ప్రాథమిక చికిత్స చేయకుండా విజయనగరం రిఫర్‌ చేశారని వాపోయారు. ఘటనకు ప్రధాన కారకుడైన ఆవాల పాపారావుపై చర్యలుతీసుకోవాలని, తమపై దాడిచేసిన ఆవాల సత్యనారాయణ, ఆవాల బాల, వెలమల గణేష్‌, ప్రసాద్‌, పరశురాం, పువ్వల రామకృష్ణపై ఎస్సీఎస్టీ, హత్యాయత్నం కేసులు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్‌ చేశారు. ఉదయం 7 గంటల సమయంలో గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. సీఐ నారాయణరావు, డీఎస్పీ ఆర్‌ గోవిందరావు గ్రామానికి చేరుకుని సర్దిచెప్పారు. దాడికిపాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇరువర్గాలను విచారించి కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.

వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్‌పై దాడి

అడ్డుకున్న మరికొందరిపైనా

పిడిగుద్దులు

పోలీసుల స్పందించడం లేదంటూ ఎస్సీల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement