భూ సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు

Nov 28 2026 1:38 AM | Updated on Nov 28 2026 1:38 AM

● కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి

విజయనగరం గంటస్తంభం: భూ సమస్యల పరిష్కారంలో జాప్యం చేయొద్దని, జిల్లాలో రీ–సర్వే ప్రక్రియను వేగవంతంచేసి డిసెంబర్‌ 15లోగా ఫేజ్‌–6 పనులు పూర్తిచేయాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాబోయే మూడునెలల్లో జిల్లాలోని అన్ని అర్హమైన గ్రామాల్లో పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ పూర్తిచేయాలని సూచించారు. మ్యుటేషన్లు, ఈకేవైసీ, భూ సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జాయింట్‌ కలెక్టర్‌ సేతుమాధవన్‌తో కలిసి శుక్రవారం ఆయన రెవెన్యూ, సర్వే, భూసేకరణ విభాగాల పనితీరుపై సమీక్షించారు. జిల్లాలోని 983 గ్రామాలకు గాను 228 గ్రామాల్లో రీ–సర్వే పూర్తికావాల్సి ఉందని, ఎస్‌.కోట, పూసపాటిరేగ, డెంకాడ, వేపాడ మండలాల్లో పాస్‌పుస్తకాల పంపిణీ శాతం తక్కువగా ఉండడంపై కలెక్టర్‌ అధికారులను వివరణ కోరారు. మ్యుటేషన్‌ దరఖాస్తులు, పెండింగ్‌లో ఉన్న 4,545 జాయింట్‌ ఎల్‌పీఎం కేసులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలోని 17 ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టుల భూసేకరణలో పెండింగ్‌ అంశాలపై కలెక్టర్‌ సమీక్షించారు. భోగాపురం మండలంలో గిగాస్కేల్‌ ఏఐ డేటా సెంటర్‌కు 889.29 ఎకరాలు, బాడంగి మండలంలో నేవల్‌ ఆర్నమెంట్‌ డిపోకు 1,796.079 ఎకరాల భూసేకరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాల ని ఆదేశించారు. తారకరామ తీర్థసాగరం, తోటపల్లి బ్యారేజ్‌ ప్రాజెక్టుల నిర్వాసితులకు బడ్జెట్‌ కారణంగా నిలిచిపోయిన పరిహారం, పునరావాస నిధులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, ఆర్డీఓలు సుధాసాగర్‌, సుధారాణి, జగన్నాథరావు, సర్వే ఏడీ విజయ్‌కుమార్‌, ఎస్‌డీసీలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement