చీపురుపల్లిరూరల్(గరివిడి): రాష్ట్రంలో రాబోయే ది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమని, 2029 ఎన్నికల్లో ప్రజలు మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తంచేశారు. కొండపాలేం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ మద్ధతుతో పోటీ చేస్తు న్న బమ్మిడి కార్తీక్ తరఫున శుక్రవారం ప్రచారం నిర్వహించారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని స్పష్టంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకుల అరాచకాలు, బెదిరింపులు, అధికార దుర్వినియోగం మితిమీరిపోయాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితవు పలికారు. అధికార బలంతో ప్రజల తీర్పును మార్చలేరని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల అభివృద్ధికి నిజాయితీగా పనిచేసే నాయకులను ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు బొత్స పూజిత, వైస్ ఎంపీపీ రెడ్డి భారతి, యువ నాయకుడు బొత్స సందీప్, ఎంపీటీసీ సభ్యుడు మజ్జి లావణ్య, నాయకులు బమ్మిడి అప్పలస్వామి, రెడ్డి గోవింద్, ఎడ్ల సూర్యారావు, తదితరులు పాల్గొన్నారు.
2029 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం ఖాయం
కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి శూన్యం
రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను ప్రజలు గమనిస్తున్నారు
శాసనమండలి విపక్షనేత
బొత్స సత్యనారాయణ


