● డిసెంబర్ 7న జిల్లా స్థాయి ప్రదర్శన
విజయనగరం అర్బన్: 2026–27 విద్యా సంవత్సరానికి సైన్స్ ఫెయిర్లను పాఠశాల, మండల, జిల్లా స్థాయిల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దక్పథం, సజనాత్మకత, పరిశోధనా ఆసక్తి పెంచడమే వాటి లక్ష్యమని పేర్కొన్నారు. పాఠశాల స్థాయి ప్రదర్శనలు నవంబర్ 30న, మండల స్థాయిలో డిసెంబర్ 4న జరుగుతాయి. జిల్లా స్థాయి ప్రదర్శన డిసెంబర్ 7న బాబామెట్టలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఉంటుంది. మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, సైన్‌న్స్ ఉపాధ్యాయులు షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు విజయవంతం చేయాలని డీఈఓ ఆదేశించారు. వివరాలకు జిల్లా సైనన్స్ కోఆర్డినేటర్ రాజేష్: 9440444674, అకాడమిక్ కోఆర్డినేటర్ : 9490009294 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.
ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుల ఇబ్బందులు తీర్చాలి
● పోలింగ్ మరుసటి రోజు ఓడీ
ఇవ్వాలి: ఏపీటీఎఫ్ వినతి
విజయనగరం అర్బన్: పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్–1938) జిల్లా శాఖ కోరింది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అథారిటీ కలెక్టర్‌ను ఉద్దేశించిన వినతిపత్రాన్ని శుక్రవారం డీఆర్వో, డీపీవో, జిల్లా విద్యాశాఖాధికారికి అందజేశారు. మొదటి దశ విధులు ముగియకముందే రెండో దశకు ఉత్తర్వులు వస్తుండడంతో విశ్రాంతి లేక ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా అలసిపోయి అనారోగ్యానికి గురవుతున్నారని నేతలు తెలిపారు. ఎన్నికల సంఘం ఉత్తర్వుల ప్రకారం పారితోషికం చెల్లించడం లేదని, మండలాల వారీగా చెల్లింపుల్లో తేడాలు ఉన్నాయని, స్టేజ్–1 ఆర్వో, ఏఆర్వోలకు కూడా సిఫార్సు మేరకు పారితోషికం అందలేదని పేర్కొన్నారు. పోలింగ్ ముగిశాక అర్ధరాత్రి రిసెప్షన్ కేంద్రాలకు చేరి, రవాణా సౌకర్యం లేక ఇబ్బందులతో ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు మరుసటి రోజే విధులకు హాజరు కావాల్సి వస్తోందన్నారు. గత ఎన్నికల్లో ఉన్నట్లుగానే మిగిలిన రెండు దశల్లోనూ పోలింగ్ మరుసటి రోజు ఓడీ సౌకర్యం కల్పిస్తూ కలెక్టర్ ఒకేసారి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎన్నికల సిబ్బందికి సరైన భోజనం, వసతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డి.ఈశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు ఎన్.వి. పైడిరాజు, అదనపు కార్యదర్శి వి.అప్పలరాజు, ఉపాధ్యక్షులు ఏవీ శ్రీనివాసరావు, పి.దామోదర్ నాయుడు, ఆర్టీఎఫ్ నాయకుడు సీహెచ్ పైడితల్లి పాల్గొన్నారు.
రహదారి, మహిళా భద్రతపై సమీక్ష
● గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలి కలెక్టర్, ఎస్పీ ఆదేశాలు
పార్వతీపురం రూరల్: జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణ, మహిళల భద్రత, గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాల నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి, ఎస్పీ ఎస్వీ మాధవ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రహదారి భద్రత, ’ఆపరేషన్ త్రిశూల్’, ‘ఎన్‌కార్డ్’ కార్యక్రమాల అమలుపై వారు సమీక్షించారు. రహదారులపై వాహనాలను ఇష్టానుసారం నిలిపే వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలకు కారణమయ్యే ప్రాంతాల్లో పొదలు, చెట్ల కొమ్మలను తొలగించాలని సూచించారు. విద్యాసంస్థలు, సంక్షేమ వసతి గృహాల్లో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, మహిళా భద్రతపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జూనియర్ కళాశాలల్లో ’ఈగల్ క్లబ్స్’ చురుగ్గా పనిచేయించాలని, మెడికల్ షాపులపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని, పోలీస్, వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ అనుమానితులకు కౌన్సెలింగ్, వైద్యసహాయం అందించాలని సూచించారు.


