వైఎస్సార్‌సీపీ అభిమానిపై టీడీపీ కుటుంబం దాడి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ అభిమానిపై టీడీపీ కుటుంబం దాడి

Nov 28 2026 1:38 AM | Updated on Nov 28 2026 1:38 AM

● బాధితుడ్ని పరామర్శించిన

శంబంగి వేణు

బాడంగి: మండలంలోని బొత్సవానివలస పంచాయతీ శివారుగ్రామైన బి.గదబవలసకు చెందిన వైఎస్సార్‌సీపీ అభిమాని గొర్లెమహేష్‌పై టీడీపీ సభ్యులు అదేగ్రామానికి చెందిన పాలవలస పైడితల్లితో పాటు, ఆయన ముగ్గురుకుమారులు పాలవలసఈశ్వరరావు, అప్పారావు. లక్ష్మణరావులు శుక్రవారం దాడికి పాల్పడగా ఈ దాడిలో గొర్లె మహేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఇందుకు సంబందించి బాధితుడితో పాటు బంధువులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి.పంచాయతీ ఎన్నికల పోలింగ్‌రోజున బొత్సవానివలస పంచాయతీలో తాను వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తరఫున ఏజెంటుగా ఉండడాన్ని సహించలేక అప్పుడే ఈశ్వరరావు పంచాయతీ సర్పంచ్‌గా గెలిచిన తరువాత నీపనిచెబుతానని హెచ్చరించాడని చెప్పాడు. పోలింగ్‌ ముగిసి ఫలితాల్లో టీడీపీ గెలిచిందని, మరునాడు ఉదయం శుక్రవారం ఉదయం ఆ కుటుంబం తన పైదాడికి దిగిందన్నారు. కొడుకులు కదలకుండా తననుపట్టుకోగా తండ్రి పైడిరాజు కర్రతో తలపైకొట్టి గాయపరిచినట్లు చెప్పారు. బందువులు తనను బాడంగి ఆస్పత్రికి తీసుకు రాగా వైద్యులు చికిత్సచేస్తున్నారని చెప్పారు. తనపై దాడి విషయమై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసినట్లు చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శంబంగి వేణు గోపాలనాయుడు సీహెచ్‌సీకి చేరుకుని బాధితుడ్ని పరామర్శించి దాడికిగల కారణాలను అడిగితెలుసుకుని న్యాయం జరిగేలా చూస్తానని భరోసాఇచ్చారు. ఇదే విషయమై ఎస్సై సూర్యకుమారి వద్ద ప్రస్తావించగా ఇరుకుటుంబాల వారిని పిలిపించి వాస్తవపరిస్థితిని తెలుసుకుని అవసరమైన చర్యలు చేపడతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement