● వరుసగా మూడో ఏడాది జాతీయ
జట్టులో స్థానం
పార్వతీపురం రూరల్: మండలంలోని నర్సిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని నగిరెడ్డి హారిక జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికై ంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ పోటీలకు హారిక వరుసగా మూడో ఏడాది అర్హత సాధించింది. శుక్రవారం పాఠశాల ఆవరణలో విద్యార్థిని హారికను ప్రధానోపాధ్యాయుడు బోను సత్యనారాయణ, ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి నల్లా బాలకృష్ణ అభినందించారు. అనంతరం హారికకు శిక్షణ ఇచ్చిన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్లు మండంగి మురళి, వసంతుల చిన్నమ్మలును ప్రధానోపాధ్యాయుడు బోను సత్యనారాయణ, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నల్లా బాలకృష్ణ, ఉపాధ్యాయ బృందం సత్కరించి అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో హారిక విజయం సాధించాలని వారు ప్రోత్సహించారు.


