2,447 ఓట్లు... 19 సీట్లు తేడా..! | - | Sakshi
Sakshi News home page

2,447 ఓట్లు... 19 సీట్లు తేడా..!

Nov 5 2026 1:52 AM | Updated on Nov 5 2026 1:52 AM

విజయనగరం అర్బన్‌: విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కేవ లం 2,447 ఓట్లు టీడీపీ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల మధ్య విజేతలను నిర్ణయించాయి. 19 డివిజన్‌ అభ్యర్థులను విజేతలుగా నిలిపాయి. కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ 35 వార్డులు, వైఎస్సార్‌సీపీ 16 వార్డులు గెలుచుకున్నాయి. అభ్యర్థుల ఓట్లను పార్టీల వారీగా పరిశీలిస్తే టీడీపీ అభ్యర్థులకు 58,033 ఓట్లు రాగా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు 55,586 ఓట్లు వచ్చాయి. ఇరు పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 2,447 మాత్రమే. లెక్కించిన అభ్యర్థుల ఓట్ల మొత్తంలో టీడీపీ వాటా సుమారు 42.6 శాతం కాగా, వైఎస్సార్‌సీపీ వాటా 40.8 శాతంగా ఉంది. ఓట్ల శాతంలో వ్యత్యాసం 1.8 శాతం. ఈ అతితక్కువ వ్యత్యాసంతో టీడీపీ 35 వార్డులు గెలుచుకోగా, వైఎస్సార్‌సీపీ 16 వార్డులకు పరిమితమైంది. అంటే, రెండు పార్టీల మధ్య సీట్ల వ్యత్యాసం ఏకంగా 19గా ఉంది. ఓట్లలో స్వల్ప తేడా ఉన్నా సీట్లలో ఇంత భారీ వ్యత్యాసం రావడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. స్వల్ప ఓట్ల తేడాతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు అపజయంపాలు కాగా, టీడీపీ అభ్యర్థులు విజేతలుగా నిలిచారు.

వార్డుల్లో నువ్వా... నేనా!

కొన్ని వార్డుల్లో గెలుపోటములు స్వల్ప ఓట్ల తేడాతో నిర్ణయమయ్యాయి. 2వ వార్డులో టీడీపీ అభ్యర్థి గంపా స్వప్నకు 642 ఓట్లు రాగా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అరుగుల అరుణకు 603 ఓట్లు వచ్చాయి. కేవలం 38 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. 19వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్‌ సాహజాది బేగంకు 1,468 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి చిప్పాడ అన్నపూర్ణకు 1,428 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కేవలం 40 ఓట్ల తేడాతో వైఎస్సార్‌సీపీ గెలిచింది. 21వ వార్డులో టీడీపీ అభ్యర్థి సుంకర వెంకటరావుకు 880 ఓట్లు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నాయని మహేష్‌కు 848 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కూడా కేవలం 32 ఓట్ల ఆధిక్యంతోనే టీడీపీ అభ్యర్థి గట్టెక్కారు. ఇక్కడ 17 ఓట్లు సాధిస్తే ఫలితం తారుమారయ్యేది. ఇలాంటి ఫలితాలు ఓటర్ల మద్దతు ఎంత స్పల్ప తేడాతో అభ్యర్థుల మధ్య మారిందో తెలియజేస్తున్నాయి. కొన్ని చోట్ల వేల తేదాతో కొందరు అభ్యర్థులు విజయం సాధించారు. 12, 18 వార్డుల్లో ఏకపక్షంగా ఓటింగ్‌ జరగడం గమనార్హం.

స్వతంత్రుల ప్రభావం కూడా తక్కువేం కాదు!

స్వతంత్ర అభ్యర్థులు మొత్తంగా 6,423 ఓట్లు సాథించారు. వీరిలో ఇద్దరు విజయం సాధించా రు. ముఖ్యంగా కొన్ని వార్డుల్లో స్వతంత్ర అభ్య ర్థులు సాధించిన ఓట్లు గెలుపొందిన, ఓడిపోయిన ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య ఉన్న మెజారీటీల కంటే ఎక్కువగా ఉన్నాయి. దీంతో కొన్ని చోట్ల స్వతంత్రుల పోటీ ప్రధాన పార్టీల ఓట్ల సమీకరణాలను ప్రభావితం చేసి ఉండవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

19 సీట్ల విజయంలో

1.8 శాతం ఓట్ల ప్రభావం

స్వల్వ మెజారిటీతో

గట్టెక్కిన అభ్యర్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement