ముచ్చటగా ఐదోసారి.. | - | Sakshi
Sakshi News home page

ముచ్చటగా ఐదోసారి..

Nov 5 2026 1:52 AM | Updated on Nov 5 2026 1:52 AM

విజయనగరం: విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శెట్టివీరవెంకట రాజేష్‌ అరుదైన ఘనత సాధించారు. తాజాగా జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో 8వ డివిజన్‌ నుంచి పోటీచేసి విజయం సాధించిన రాజేష్‌ వరుసుగా అదే ప్రాంతం నుంచి ఐదుసార్లు కౌన్సిలర్‌, కార్పొరేటర్‌గా గెలుపొందడం గమనార్హం. రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీ తరఫున, ఒకసారి స్వంతంత్య్ర అభ్యర్థిగా, రెండుసార్లు వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసి గెలుపొందారు. తనను నమ్మి ఓట్లేసి గెలిపిస్తున్న ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. సేవలే తనకు శ్రీరామరక్షగా పేర్కొన్నారు.

పటిష్ట బందోబస్తు

విజయనగరం టౌన్‌: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంతయుతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టబందోబస్తు ఏర్పాటుచేశామని ఎస్పీ ఎ.ఆర్‌.దామోదర్‌ బుధవారం తెలిపారు. జిల్లాలో 27 ఎంపీటీసీ, 438 ఎంపీటీసీ స్ధానాలకు 895 లొకేషన్స్‌లో 1586 కేంద్రాల్లో పోలింగ్‌ జరగనుంది. బందోబస్తు కోసం ఇద్దరు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 35 మంది సీఐలు, 75 మంది ఎస్‌ఐలతో సహా సుమారు 2వేల మంది పోలీసులను బందోబస్తు నిమిత్తం వినియోగిస్తున్నామన్నారు. అత్యవసర వేళ స్థానిక పోలీస్‌ లేదా టోల్‌ ఫ్రీ 100/112కు కాల్‌ చేయాలని ఎస్పీ కోరారు.

ఏర్పాట్లపై పర్యవేక్షణ

● కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌

నుంచి పరిశీలించిన కలెక్టర్‌

విజయనగరం రూరల్‌: జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌. రాంసుందర్‌ రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతు మాధవన్‌ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఎన్నికల ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, కేంద్రాల వద్ద జరుగుతున్న ఏర్పాట్లు, పోలింగ్‌ బృందాలు డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలకు చేరుకున్న తీరు, సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ తదితర అంశాలపై ఆరా తీశారు. పోలింగ్‌ ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని ముందస్తు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. పోలింగ్‌ బృందాలు తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని, ఎన్నికల సామగ్రి పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, వెబ్‌ కాస్టింగ్‌ తదితర మార్గాల ద్వారా పోలింగ్‌ సరళిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని కలెక్టర్‌ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement