కూటమి మాయలు ఎండగట్టండి | - | Sakshi
Sakshi News home page

కూటమి మాయలు ఎండగట్టండి

Oct 17 2026 12:46 AM | Updated on Oct 17 2026 12:46 AM

కూటమి మాయలు ఎండగట్టండి

బొండపల్లి: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హమీలను ఒక్కటి కూడా అమలు చేయక, తర్వలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను మాయ మాటలతో మభ్య పెట్టనున్న విషయాలను గ్రామగ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలని శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ గజపతినగరం నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ బొత్స అప్పలనరసయ్యలు అన్నారు. ఈ మేరకు బొండపల్లి మండలంలోని కొత్త పాలెం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ వైస్‌ ఎంపీపీ బొడ్డు రాముతో పాటు గ్రామ మాజీతాజా సర్పంచ్‌ బొడ్డు సత్యవతి, మరో వంద కుటుంబాల వారు జిల్లా కేంద్రంలోని బొత్స అప్పలనరసయ్య క్యాంపు కార్యాలయంలో శుక్రవారం టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి బొత్స అప్పలనరసయ్య పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప నియోజకవర్గానికి ఈ కూటమి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు బొత్స సాయిగురునాయుడు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బీవీ ప్రభూజీరాజు, మాజీ ఎంపీపీ చల్లా చలం నాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు బొద్దల చిన్నం నాయుడు నాయకులు మహంతి రమణ, కర్రోతు శ్రీనివాసరావు, సాలాపు పెంటం నాయుడు, మంత్రి గోవింద, పల్లి రఘు, వేమలి వెంకటరావు, బోడసింగి జగదీశ్వర్రావు, సిరిపురం నాయుడుబాబు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలో పలువురి చేరిక

రామభద్రపురం: మండలంలోని కొండకెంగువ గ్రామపంచాయతీ రెండవ వార్డుకు చెందిన తాజా మాజీ వార్డు మెంబర్లు కర్రి దాలినానాయుడు, పెదపల్లి సీతారాంల తో పాటు పలు కుటుంబాలు గురువారం మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, మాజీ ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు అప్పికొండ నిర్మల సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శంబంగి వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో గ్రామ సీనియర్‌ నాయుకుడు బెవర ప్రసాదరావు, మాజీ ఎంపీటీసీ కంచుపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సమరానికి వైఎస్సార్‌సీపీ సన్నద్ధం

పార్వతీపురం రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసే లక్ష్యంతో పార్వతీపురం వైఎస్‌స్రా్‌సీపీ శ్రేణులు కదనోత్సాహంతో సన్నద్ధమవుతున్నాయి. పురపాలక ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతూ శుక్రవారం పలువురు నాయకులు మాజీ శాసనసభ్యుడు అలజంగి జోగారావు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఎన్నికల క్షేత్రంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో అడుగులేసి, ఉమ్మడి కృషితో పార్టీ విజయానికి అహర్నిశలు శ్రమించాలని ఈ సందర్భంగా జోగారావు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో..టీడీపీ నుంచి 20వ వార్డుకు చెందిన నాగిరెడ్డి ధనుంజయ్‌, రాధ, అలాగే 31వ వార్డు నుంచి సారిక సుధాకరరావు (భవాని) పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే, వారినే ఆయా వార్డుల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా అధికారికంగా ప్రకటించారు. అందరూ కలిసికట్టుగా కదిలి ప్రజాక్షేత్రంలో అభ్యర్థుల గెలుపునకు బాటలు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు సర్వీశెట్టి శ్రీనివాసరావు, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు గాడు శంకరరావు, సీనియర్‌ నాయకులు నిమ్మకాయల సుందరరావు, బొంగు సురేష్‌, రాధ, ధర్మవరపు గురుమూర్తితో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలో 17 కుటుంబాలు చేరిక

గుర్ల: స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శాసన మండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సూచించారు. ఈ మేరకు గుర్ల మండలంలోని సొలిపిసోమరాజు పేటకు చెందిన 17 కుటుంబాల వారు గంటాన ప్రవీణ్‌, గంటాన గోవింద్‌, గంటాన వంశీ, గిడిజాల రాజయ్య, గొడ్డు సాయి, బూర రాజు, టొంపల శివ, గిడిజాల రాంబాబు, బండి సుగుణకుమార్‌, గిడిజాల అప్పలరాజు, గిడిజాల వర ప్రసాద్‌, గిడిజాల పైడిరాజు, గిడిజాల రాజారావు, గిడిజాల వంశీ, గంటాన శంకర్‌లకు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వైఎస్సార్‌సీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వనించారు. గరివిడి క్యాంపు కార్యాలయంలో గుర్ల మండల నాయకులతో శుక్రవారం ఆయన సమావేశమైన సందర్భంగా పార్టీలో చేరికలు జరిగాయి. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ సూర్యనారాయణ రాజు, పార్టీ మండల అధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడు, మాజీ జెడ్పీటీసీ శీర అప్పలనాయుడు, వైఎస్సార్‌సీపీ నాయకులు వరదా ఈశ్వరరావు, బెల్లాన బంగారునాయుడు, జమ్ము స్వామినాయుడు, తోట తిరుపతిరావు పాల్గొన్నారు.

శాసనమండలి విపక్షనేత

బొత్స సత్యనారాయణ,

మాజీ ఎమ్మెల్యే అప్పలనరసయ్య

టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ వైస్‌ ఎంపీపీ రాము,

100 కుటుంబాల వారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement