–8లో
పరేడ్ గ్రౌండ్ వీడి ప్రజా రక్షణకు..
మహిళలు అన్నిరంగాల్లోనూ రాణిస్తున్నారు. పోలీస్ ఉద్యోగం శిక్షణ పూర్తిచేసుకుని ప్రజా రక్షణ విధులకు సిద్ధమవుతున్నారు.
రామభద్రపురం:
పత్తి రైతుల ఆశలు గల్లంతయ్యాయి. మొన్నటివరకు ఎల్‌నినో ప్రభావం సాగుపై చూపింది. నీటి వసతి ఉన్నచోట సాగుచేసిన పత్తి పంటను ఇప్పుడు తుఫాన్ ఊడ్చుకుపోయింది. పత్తికాయలు తడవడంతో కుళ్లిపోతున్నాయి. వర్షపు నీరు తగ్గుతున్నకొద్దీ పత్తి మొక్కలు చనిపోతుండడంతో రైతులు కన్నీరుపెడుతున్నారు. పెట్టుబడి అంతా వర్షార్పణం అయ్యిందని, ప్రభుత్వం ఆదుకోకుంటే అప్పుల్లో కూరుకుపోతామంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
● ఇదీ పరిస్థితి...
ఈ ఏడాది జిల్లాలో 2,291 హెక్టార్లలో పత్తిపంటను రైతులు సాగుచేశారు. రామభద్రపురం మండలంలోనే 1320 ఎకరాల్లో పత్తిపంట సాగులో ఉంది. మరికొన్నిచోట్ల వరికి ప్రత్యామ్నాయంగా పత్తిని సాగుచేశారు. వర్షాభావంతో పంట కాస్త దెబ్బతిన్నా... ఉన్న పంట చేతికొస్తే పెట్టుబడి వస్తుందని రైతులు ఆశించారు. కాయ పక్వానికి, విచ్చుకునే దశలో కురిసిన తుఫాన్ వర్షాలు పంటను నాశనం చేశాయి. పగిలిన కాయల్లో నీరు చేరడంతో నల్లబడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో యివకపట్టడంతో పత్తి మొక్కలు చచ్చిపోతున్నాయి. చేతికందిన పత్తి కూడా తడిసిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, ఇప్పుడు పంటంతా పాడైందని, అప్పులు ఎలా తీర్చాలో తెలియడంలేదంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
ఆదుకోండయ్యా..
చిత్రంలో చనిపోతున్న పత్తి మొక్కలు చూపుతున్న రైతు పేరు చొక్కాపు రాములు. రామభద్రపురం గ్రామం. ఈయన ఈ ఏడాది రూ.25 వేలు పైబడి పెట్టుబడి పెట్టి ఎకరం విస్తీర్ణంలో పత్తి పంట సాగు చేశాడు. ఇప్పటి వరకు తీవ్ర వర్షాభావంతో కొంత మేర పంట దెబ్బతింది. ఇప్పుడు పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ తీవ్రతకు 75 శాతంపైగా నీట మునిగింది. భూమిలో నీరు ఆరుతున్న కొద్దీ మొక్క వేరు కుళ్లిపోవడంతో పాటు ఆకు పూర్తిగా రాలిపోయి చనిపోతోంది. పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశం లేదంటూ లబోదిబోమంటున్నాడు. ప్రభుత్వం స్పందించి పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాడు.
నిన్నటి వరకు ఎల్‌నినో.. ఇప్పుడు తుఫాన్ వర్షాలతో పంటకు నష్టం
వర్షానికి తడిసి ముద్దయిన కాయలు, పత్తి
వరదనీరు నిల్వతో చనిపోతున్న చేను
ఆవేదనలో రైతులు
ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి


