పత్తి పంటకు నష్టం | - | Sakshi
Sakshi News home page

పత్తి పంటకు నష్టం

Sep 27 2026 1:28 AM | Updated on Sep 27 2026 1:28 AM

పత్తి కాయ విచ్చుకుంటున్న సమయంలో వర్షాలు కురవడంతో పంటకు నష్టం వాటిల్లింది. నాణ్యత తగ్గింది. కొన్నిచోట్ల చేను చనిపోతుండడం వాస్తవమే. దీని నివారణకు పొలంలో నీరు లేకుండా చేయాలి. వ్యవసాయాధికారుల సూచనల మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పంట నష్టం అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిస్తాం.

– ఎం మధుసూదనరావు, వ్యవసాయశాఖ ఏడీఏ

నష్టపోయాం..

నేను ఒక ఎకరా పొలం కౌలుకు తీసుకుని పత్తిపంట వేశాను. తుఫాన్‌ వల్ల కురిసిన భారీ వర్షం పంటను ముంచేసింది. ఒక్కో చెట్టుకు 30 నుంచి 40 కాయలు వరకు కుళ్లిపోయాయి. పత్తి దిగుబడి తగ్గడంతో పాటు నాణ్యత తగ్గిపోతోంది. ఎకరాకు రూ.20 వేలు వరకు నష్టం వచ్చే పరిస్థితి ఉంది. పెట్టుబడి కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియడంలేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.

– చొక్కాపు నారాయణరావు,

పత్తి రైతు, రామభద్రపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement