విజయనగరం టౌన్/ క్రైమ్: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి అమ్మవారిని హైకోర్టు జడ్జి సుజాత శనివారం దర్శించుకున్నారు. చదురుగుడికి వచ్చిన జడ్జికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి పూజ అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి విశిష్టత, సిరిమానోత్సవ వైభవాన్ని తెలియజేశారు.
● విజయనగరం కోర్టు కాంప్లెక్స్‌లో నిర్వహించే జ్యుడీషియల్ అధికారుల కాన్ఫరెన్స్, వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి వి.సుజాతను ఎస్పీ ఏఆర్ దామోదర్ మర్యాదపూర్వకంగా కలిసి, పూలమొక్కను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి ఎం.బబిత పాల్గొన్నారు.


