ఆవు మృతితో రైతు గగ్గోలు | - | Sakshi
Sakshi News home page

ఆవు మృతితో రైతు గగ్గోలు

Sep 27 2026 1:28 AM | Updated on Sep 27 2026 1:28 AM

జియ్యమ్మవలస రూరల్‌: మండలలలోని చింతల బెలగాం గ్రామానికి చెందిన గంట జగ్గారావు అనే గిరిజన రైతుకు చెందిన ఆవు శనివారం ఉదయం గ్రామ సమీపంలోకి మేతకు వెళ్లి విద్యుదాఘాతంతో మృతి చెందింది. రోడ్డు పక్కనున్న విద్యుత్‌ స్తంభాన్ని తాకడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆవు మృతి చెందడంతో బాధిత రైతు లబోదిబోమంటున్నాడు.

‘చలో విజయవాడ’కు అనుమతి లేదు

విజయనగరం టౌన్‌: తమ డిమాండ్ల సాధన కోసం జిల్లాలో పనిచేస్తున్న స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగస్తులు సెప్టెంబర్‌ 27న చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ స్పష్టం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజల భద్రత, సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలు, అత్యవసర సేవలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉద్యోగులందరూ అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతించలేదని స్పష్టం చేశారు. ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

పార్వతీపురం రూరల్‌: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతుల్లేవని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అనుమతి లేని ఆందోళన కార్యక్రమాలకు ఉద్యోగులు వెళ్లకూడదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement