స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష

Sep 27 2026 1:28 AM | Updated on Sep 27 2026 1:28 AM

స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష

విజయనగరం టౌన్‌/పార్వతీపురం రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, నేర నియంత్రణ, మహిళల భద్రత, రోడ్డు భద్రత, గంజాయి నిర్మూలనపై విశాఖ రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జెట్టీ రేంజ్‌ పరిధిలో ఉన్న ఎస్పీలతో శనివారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెండింగ్‌ కేసులు, సైబర్‌ క్రైమ్‌ అంశాలపై జిల్లాల వారీగా ఆరా తీశారు. శాంతిభద్రతల పరిస్థితి, గత ఎన్నికల్లో జరిగిన సంఘటనలు, సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన, అత్యంత సున్నితమైన పోలింగ్‌ కేంద్రాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక భద్రతా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో ఎన్నికల భద్రతను ఎస్పీలు స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. మన్యం జిల్లాలో గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపాలని, అక్రమార్కుల ఆస్తుల జప్తుతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు ఏఎస్పీ, పోలవరం, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురంమన్యం, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు కె.చక్రవర్తి, తుహిన్‌ సిన్హా, ఏఆర్‌.దామోదర్‌, మాధవ్‌ రెడ్డి, కేవీ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement