పర్యాటకులను ప్రోత్సహిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

పర్యాటకులను ప్రోత్సహిస్తున్నాం

Sep 27 2026 1:28 AM | Updated on Sep 27 2026 1:28 AM

పర్యాటకులను ప్రోత్సహిస్తున్నాం

● కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. ప్రభాకరరెడ్డి

పాచిపెంట: ‘సాహసం చేయాలంటే పారమ్మకొండకు రండి’ అనే నినాదంతో పర్యాటకులను ప్రోత్సహిస్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. ప్రభాకరరెడ్డి అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని పారమ్మకొండ వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శనివారం వేడుకలు నిర్వహించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్‌ ఎన్‌. ప్రభాకరరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ముందుగా పారమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పారమ్మకొండతో పాటు జిల్లాలోని జలపాతాలు, పెద్దగెడ్డ, వెంగళరాయసాగర్‌ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అనంతరం వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. అధికారులు, ప్రజాప్రతినిధలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement