అంగన్‌వాడీ పోస్టుల భర్తీ ఎప్పుడు? | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ పోస్టుల భర్తీ ఎప్పుడు?

Sep 24 2026 2:42 AM | Updated on Sep 24 2026 2:42 AM

సిబ్బంది కొరతతో అరకొర సేవలు

అంగన్‌వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత కారణంగా కేంద్రాల పరిధిలో ఉన్న గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సేవలు అరకొరగా అందుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్‌వాడీ పోస్టులు భర్తీ చేసింది లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విజయనగరం ఫోర్ట్‌:

గంట్యాడ మండలంలోని ఓ గ్రామంలో ఏడాది కాలంగా అంగన్‌ వాడీ ఆయా పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఆయా, కార్యకర్త విధులు కార్యకర్తే నిర్వహిస్తోంది.

● విజయనగరం పట్టణంలోని రాజీవ్‌నగర్‌ కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో గత కొద్ది నెలలు నెలలుగా ఆయా పోస్టు ఖాళీగా ఉంది. ఇప్పటి వరకు అ పోస్టును భర్తీ చేయలేదు. దీంతో కార్యకర్తే ఈ సెంటర్‌కు దిక్కుగా నిలిచారు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు ప్రతి మీటింగ్‌లోనూ అధికారంలోకి వస్తే ఏటా లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని ఊరురా గొప్పగా ప్రచారం చేసుకున్నారు.పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉన్నా ప్రస్తుతం భర్తీ చేయకుండా తీవ్ర జాప్యం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సీ్త్ర,శిశు సంక్షేమశాఖ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అధిక సంఖ్యలో పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నప్పటికీ చంద్రబాబు సర్కార్‌ మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో నిరుద్యోగ మహిళలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. అధికారంలోవస్తే ఏటా పోస్టులు భర్తీ చేస్తామన్న చంద్రబాబు వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో 2499 అంగన్‌వాడీ కేంద్రాలు

జిల్లాలో 2499 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 112 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు, 2387 మెయిన్‌అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిపరిధిలో గర్భిణులు 7,300 మంది, బాలింతలు 7,077 మంది, ఆరు నెలల లోపు పిల్లలు 6509మంది ఉన్నారు. 7 నెలల నుంచి 3 ఏళ్ల లోపు పిల్లలు 35,208 మంది, 3 ఏళ్ల నుంచి 6 సంవత్సరాల పిల్లలు 15,897మంది ఉన్నారు.

ఖాళీగా 351పోస్టులు

అంగన్‌వాడీ కేంద్రాల్లో 351 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 317 ఆయా (హెల్పర్‌ ) పోస్టులు, 30 వర్కర్‌ (కార్యకర్త) పోస్టులు, 4 మినీ అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏళ్ల తరబడి పోస్టులు భర్తీ చేయకుండా టీడీపీ సర్కార్‌ జాప్యం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏర్పడిన ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేవారు. దీని వల్ల సిబ్బంది కొరత ఉండేది కాదు. లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో సేవలు అందేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

ఆయా, కార్యకర్తల్లో ఒక్కరే దిక్కు

కార్యకర్త, ఆయా పోస్టుల్లో ఎవరో ఒక్కరే అంగన్‌వాడీ కేంద్రాలకు దిక్కుగా నిలుస్తున్నారు. కార్యకర్త, ఆయా సేవలు అందించాల్సి ఉన్నప్పటికీ పోస్టులు భర్తీ చేయక పోవడం వల్ల కార్యకర్త లేని చోట పిల్లలకు బోధన చెప్పువారే కరువుతున్నారు. ఆయా లేని చోట పిల్లలకు రుచికరమైన భోజనం పెట్టే వారు కరువుతున్నారు.

పోస్టుల భర్తీకి చర్యలు

జిల్లాలో 351 ఖాళీగా ఉన్నాయి. ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం. మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడేషన్‌ చేయాల్సి ఉంది. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వనున్నాం.

– కేవీ.బాలామణి, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ సాధికారత అధికారిణి

కార్యకర్త, ఆయాల్లో ఒక్కరే

అంగన్‌వాడీ కేంద్రాలకు దిక్కు

లబ్ధిదారులకు అరకొరగా సేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement