● స్పందించిన సివిల్ సప్లైస్ అధికారులు
విజయనగరం ఫోర్ట్: అంగన్‌వాడీ కేంద్రాల లబ్ధిదారులకు విటమిన్స్, మినరల్స్ కలిపిన సార్టెక్స్ బియ్యం గత రెండు నెలలుగా నిలిచిపోయాయనే అనే అంశంపై బుధవారం సాక్షిలో అంగన్‌వాడీ లబ్ధిదారులకు నిలిచిన సార్టెక్స్ బియ్యం శీర్షికన ప్రచురించిన కథనానికి సివిల్ సప్‌లైస్ డీఎం బి. శాంతి స్పందించారు. గత రెండు నెలలుగా సార్టెక్స్ బియ్యం ప్రత్యేకప్యాకింగ్ ద్వారా సరఫరా నిలిచిపోయిందన్నారు. అయితే సార్టెక్స్ బియ్యమే లూజు గా సరఫరా చేస్తున్నామని తెలిపారు.


