● నీట్ లీకేజీపై భగ్గుమన్న విదార్థులు
● ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ
కాంప్లెక్స్ వద్ద మానవహారం
విజయనగరం గంటస్తంభం: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం విజయన గరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విద్యార్థులు ఆందోళన చేశారు. మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యతవహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్మి బందెల నాసర్ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో కష్టపడి నీట్ పరీక్షకు సిద్ధమైతే కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో వారి భవిష్యత్తు అని శ్చితిలో పడిందన్నారు. గతంలోనూ నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని విమర్మించారు. పరీక్షల నిర్వహణలో ఎన్‌టీఏ పూర్తిగా విఫలమైందని, విద్యార్థుల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఎన్‌టీఏను రద్దు చేసి పారదర్శకమైన విధానంలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్మి ఎన్.నాగభూషణం, ఉపాధ్యక్షుడు ఎ.సుమన్, సహాయ కార్యదర్మి పి.గౌరీశంకర్, జిల్లా నాయకులు వి.గణేష్, సత్యనారాయణ, చరణ్ తేజ, మాధవి, రాము, తదితరులు పాల్గొన్నారు.


