నకిలీ నియామక ప్రకటనలు నమ్మొద్దు | - | Sakshi
Sakshi News home page

నకిలీ నియామక ప్రకటనలు నమ్మొద్దు

Jun 7 2026 12:27 AM | Updated on Jun 7 2026 12:27 AM

కేంద్రీయ గిరిజన వర్సిటీ ఇన్‌చార్జి వీసీ శ్రీనివాసన్‌

విజయనగరం రూరల్‌: కేంద్రీయ విశ్వ విద్యాలయం పేరుతో సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్‌ వేదికల్లో కొన్ని నకిలీ నియామక ప్రకటనలు, ఉద్యోగ అవకాశాల సమాచారంతో తప్పుడు సందేశాలు ప్రచారంలో ఉన్నట్లు విశ్వవిద్యాలయం దృష్టికి వచ్చిందని, నిరుద్యోగులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్సిటీ ఇన్‌చార్జి వీసీ టి.శ్రీనివాసన్‌ శనివారం ఒక ప్రకటనలో కోరారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఇటువంటి సమాచారం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. అభ్యర్థులు నకిలీ ప్రకటనలు నమ్మొద్దని, తమ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలకు సంబంధించి ధ్రువపత్రాలు అందించవద్దని, ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరపొద్దని ఆయన కోరారు. విశ్వవిద్యాలయం పేరు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా వ్యక్తులు, సంస్థలు సంప్రదిస్తే వర్సిటీ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయంలో జరిగే అన్ని నియామకాలు, ఉద్యోగ ప్రకటనల సమాచారం విశ్వ విద్యాలయం వెబ్‌సైట్‌లో అధికారికంగా జారీచేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement