ఫైలేరియా వ్యాధి ఒక రోజులో వచ్చేది కాదు. దీని ప్రభావం కొన్ని సంవత్సరాల తరువాత కనిపిస్తుంది. దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే నియంత్రించడం సాధ్యమవుతుంది. ప్రజలు ఇంటి ముందు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వైద్య సిబ్బంది పంపిణీ చేసే ఫైలేరియా నియంత్రణ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి. ఒమ్మితో పాటు అన్ని గ్రామాల్లోనూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. –డాక్టర్ అనిల్‌కుమార్, వైద్యాధికారి,
సతివాడ పీహెచ్‌సీ


