● జిల్లాలో 518 స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు
● 90 బస్సుల్లో లోపాల గుర్తింపు..నోటీసులు జారీ
● స్కూల్స్ తెరుచుకునేలోపు ప్రతి బస్సుపై నిఘా
పిల్లల ప్రాణాలపై ప్రయోగాలు వద్దు
స్కూల్ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్‌టింగ్వషర్, ఎమర్జెన్సీ డోర్, సురక్షిత సీట్లు, సరైన బ్రేక్ వ్యవస్థ, అనుభవజ్ఞులైన డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలని తల్లిదండ్రులు సూచిస్తున్నారు. కేవలం పత్రాల పరిశీలనతో సరిపెట్టకుండా వాహనం రోడ్డుపై ఎలా పనిచేస్తోందో కూడా పరీక్షించాలని కోరుతున్నారు.
తూతూ మంత్రం తనిఖీలు వద్దంటున్న తల్లిదండ్రులు:
గతంలో కొన్ని సందర్భాల్లో తనిఖీలు కేవలం నామమాత్రంగా జరిగాయనే విమర్శలు వినిపించాయి. ఈసారి మాత్రం ప్రతి బస్సును క్షుణ్ణంగా పరిశీలించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పేపర్ మీద సర్టిఫికెట్ ఇచ్చేయడం కాకుండా బస్సు నిజంగా సురక్షితమా కాదా అనేది చూడాలని పలువురు తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.


