జర్మన్‌ సంస్థతో జేఎన్‌టీయూ జీవీ ఒప్పందం | - | Sakshi
Sakshi News home page

జర్మన్‌ సంస్థతో జేఎన్‌టీయూ జీవీ ఒప్పందం

Jun 7 2026 12:09 AM | Updated on Jun 7 2026 12:09 AM

జర్మన్‌ సంస్థతో జేఎన్‌టీయూ జీవీ ఒప్పందం

విజయనగరం రూరల్‌: ఉన్నత విద్యను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే దిశగా స్థానిక జేఎన్‌టీయూ జీవీ కీలక ముందడుగు వేసింది. జర్మనీ దేశానికి చెందిన ప్రముఖ విద్యాసంస్థ రోత్‌లాంగేన్‌ యూనివర్సిటీ నాలెడ్జ్‌ ఫౌండేషన్‌ (కెఎఫ్‌ఆర్‌యు)తో శనివారం విద్యా సహకార ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఇరు సంస్థల ప్రతినిధులు జేఎన్‌టీయూలో నిర్వహించిన కార్యక్రమంలో ఒప్పందపత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది నుంచే అంతర్జాతీయ సమగ్ర డిగ్రీ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఒప్పందంతో విద్యార్థులు కేవలం ఐదేళ్లలోనే భారతీయ డిగ్రీతోపాటు అంతర్జాతీయ గుర్తింపు పొందిన జర్మన్‌ ఎంఎస్సీ డిగ్రీని సొంతం చేసుకునే అవకాశం లభిస్తుందని జేఎన్‌టీయూ జీవీ ప్రతినిధులు తెలి పారు. పలు కోర్సులు అందుబాటులో ఉంటాయ ని, నాణ్యమైన విద్య, తక్కువ ఫీజు, పరిశ్రమలతో అనుసంధానమైన విద్యావిధానం, ప్రపంచ ప్రఖ్యా త పరిశ్రమల్లో భారతీయ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని వారు పేర్కొన్నారు. ఇంటర్మీ డియట్‌, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డుల్లో ఎంపీసీ గ్రూపులో కనీసం 60 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు వాటికి ధరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఏడాది ఈ కోర్సుల్లో ప్రవేశాలకు కొద్ది రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ 7288873337 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement