‘పచ్చని చెట్లు –ప్రగతికి మెట్లు | - | Sakshi
Sakshi News home page

‘పచ్చని చెట్లు –ప్రగతికి మెట్లు

Jun 6 2026 12:47 AM | Updated on Jun 6 2026 12:47 AM

జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయ మూర్తి విజయ కల్యాణి

విజయనగరం లీగల్‌: పచ్చని చెట్లు–ప్రగతికి మెట్లు అని మొక్కలను నాటి పెంచి పర్యావరణ పరిరక్షణ చేపట్టాలని, రోజురోజుకూ పెరుగుతున్న వేడి వాతావరణం తగ్గించడం కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలను పెంచాలని జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి విజయ కల్యాణి అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం‘ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని మొక్కలను నాటి వాటిని సంరక్షించాలన్నారు. భూమి మీద వేడి ని కొంత మేరకు అయినా తగ్గించగలమని, ప్రస్తుతం వాడుతున్న ఎలక్ట్రానిక్‌ పరికరాల వల్ల ఏర్పడిన గ్లోబల్‌ వార్మింగ్‌ ను నివారించగలమన్నారు. పర్యావరణానికి నష్టం కలిగించే వాటి నుంచి మొక్కల పెంపకం కొంత వరకు దోహద పడుతుందన్నారు. కార్యక్రమంలో ఫస్ట్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషనన్స్‌ జడ్జి, ప్లాపూస్‌ చైర్మన్‌ జి.దుర్గయ్య, సీనియర్‌ సివిల్‌ జడ్జి అండ్‌ ఇన్‌చార్జి రమేష్‌ నాయుడు, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి. శ్రీనివాసరావు, బీబీఆర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బ్రహ్మాజీ, సెక్రటరీ గడి.మురళి, ప్రభుత్వా న్యాయవాది రెడ్డి సత్యనారాయణ, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గేదెల సత్యం, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ బెల్లాన రవి, సీనియర్‌ అడ్వకేట్‌ బొడ్డు సత్యనారాయణ, శ్రీనివాసరావు, ఇతర జూనియర్‌, సీనియర్‌ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, ప్రింట్‌ అండ్‌ ఎలక్రానిక్‌ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement