సాక్షిప్రతినిధి, విజయనగరం:
వెన్నుపోటు రాజకీయాలకు సీఎం చంద్రబాబు కేరాఫ్ అడ్రస్‌గా చరిత్రలో నిలిచిపోయారని జనం మండిపడ్డారు. నాడు పిల్లనిచ్చిన మామ దివంగత ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడుచి పార్టీని, పదవిని లాక్కున్న చంద్రబాబు.. నేడు ఎన్నికలకు ముందు ప్రజలకు సాధ్యం కానీ హమీలు గుప్పించి వాటిని అమలు చేయకుండా అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ రెండేళ్లుగా వెన్నుపోటు పొడుస్తున్నారని దుమెత్తిపోశారు. మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు గురువారం జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండలాల్లో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరిట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లి పంచిన బాండ్‌లతో పాటు సూపర్ సిక్స్ పేరిట ప్రకటించిన మేనిఫెస్టో జాబితాలను దహనం చేశారు. చేతగాని ప్రభుత్వం గద్దె దిగాలి.. వెన్నుపోటుబాబు.. చంద్రబాబు... ఇచ్చిన హమీలన్నీ తక్షణమే అమలు చేయాలంటూ నినాదాలు చేశారు.
● ఎగసిన నిరసన సెగ
చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా విజయనగరం నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జనం ఆందోళన చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు మోసపూరిత పాలనను ఎండగట్టారు. మాకొద్దీ రాక్షసపాలన అంటూ నినదించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఇచ్చిన బాండ్‌లు, ప్రకటించిన మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, మాజీ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, పార్టీ మండలాధ్యక్షుడు కెల్ల త్రినాథరావు, కార్పొరేషన్ మాజీ ఫ్లోర్‌లీడర్ శెట్టి వీరవెంకటరాజేష్, తదితరులు పాల్గొన్నారు.
● మీ పాలనకో దండం
ఎన్నిల్లో లబ్ధికోసం ఉత్తుత్తి హామీలిచ్చి మోసం చేశారంటూ రాజాం నియోజకవర్గ ప్రజలు మండిపడ్డారు. చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై నిరసన తెలిపారు. రెండేళ్లుగా దగాకోరు పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా రాజాం పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తలే రాజేష్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. పొనుగుటివలస కూడలిలో మానవహారం నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్ట్రోపతులను చించివేసి నిరసన తెలిపారు. సంతకవిటి, రేగిడి, వంగర మండలాల్లోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, జెడ్పీ వైస్‌చైర్మన్ సిరిపురపు జగన్మోహనర్‌రావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వ మోసాలపై కరపత్రాలను
ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, నాయకులు
వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ చంద్రబాబు
నాడు పిల్లనిచ్చిన మామకు...
నేడు ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు
ఇచ్చిన హమీలు అమలు
చేయకుండా ప్రజలను
వంచిచుస్తున్న వైనం
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు
అన్ని మండల కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన
టీడీపీ మేనిఫెస్టో ప్రతుల దహనం


