● బొబ్బిలిలో నిరసన హోరు | - | Sakshi
Sakshi News home page

● బొబ్బిలిలో నిరసన హోరు

Jun 5 2026 1:00 AM | Updated on Jun 5 2026 1:00 AM

అధికారం కోసం ఉత్తుత్తి హామీలిచ్చి.. ఓట్లు దండుకున్నాక జనాన్ని నిలువునా ముంచేశారంటూ చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంపై జనం నిప్పులుచెరిగారు. సూపర్‌ సిక్స్‌ అంటూ జనానికి మోసం ఫిక్స్‌చేశారన్నారు. రెండేళ్లుగా చంద్రబాబు సాగిస్తున్న ప్రజావ్యతిరేక పాలనకు నిరసనగా బొబ్బిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. పార్టీ బొబ్బిలి సమన్వయకర్త శంబంగి వెంకట చినప్పలనాయుడు సమక్షంలో బొబ్బిలిలోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ టీడీపీ మేనిఫెస్టో ప్రతులు, బాండ్లను దహనం చేశారు. ప్రజలను చంద్రబాబు వంచిస్తున్న తీరును వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ ఎస్‌ఈసీ సభ్యులు ఇంటి గోపాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శంబంగి వేణుగోపాలనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు తమ్మిరెడ్డి ధామోదరరావు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎస్‌.వి.మురళీకష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement