● ఉత్తుత్తి హామీలతో మోసం చేశారు | - | Sakshi
Sakshi News home page

● ఉత్తుత్తి హామీలతో మోసం చేశారు

Jun 5 2026 1:00 AM | Updated on Jun 5 2026 1:00 AM

ఉత్తుత్తి హామీలతో చంద్రబాబు, కూటమి నాయకులు మోసం చేశారంటూ జనం మండిపడ్డారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనపై చీపురుపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చీపురుపల్లి, గరివిడి మండలాల్లో శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ కుమారుడు డా.బొత్ససందీప్‌, గుర్ల, మెరకముడిదాం మండలాల్లో కుమార్తె బొత్స అనూష పాల్గొన్నారు. చంద్రబాబు సూపర్‌సిక్స్‌ హామీ ప్రతులను చింపి నిరసన తెలిపారు. హామీలు అమలుచేయలేని చేతగాని నాయకులు గద్దె దిగాలంటూ నినదించారు. కూటమి వెన్నుపోటు పాలనను అనూష ఎండగట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement