పిడుగుపాటుతో మూగజీవాలు.. | - | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుతో మూగజీవాలు..

Jun 5 2026 12:54 AM | Updated on Jun 5 2026 12:54 AM

పిడుగుపాటుతో మూగజీవాలు..

వేపాడ: మండలంలోని కొండగంగుబూడి గ్రామం సమీపంలో గురువారం సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో పిడుగుపడి తొమ్మిది మేకలు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రామస్వామిపేట గ్రామానికి చెందిన పత్రి శ్రీను మేకలను మేతకోసం కొండగంగుబూడి గ్రామం సమీపంలో విజయరామసాగరం చెరువు వద్దకు తోలుకెళ్లాడు. మధ్యాహ్నం వర్షం కురిసిన సమయంలో పిడుగు పడి రెండు మేకపోతులు, ఏడు మేకలు చనిపోయాయి. కె.జి.పూడి గ్రామానికి చెందిన చలుమూరి వెంకటరావుకు చెందిన ఒక మేక పిడుగుపాటుతో చనిపోయింది. జీవాల మరణంతో సుమారు రూ.3లక్షల మేర నష్టం వాటిల్లినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement