ఇంటింట పింఛన్ల పంపిణీకి మంగళం..! | - | Sakshi
Sakshi News home page

ఇంటింట పింఛన్ల పంపిణీకి మంగళం..!

Jun 5 2026 12:54 AM | Updated on Jun 5 2026 12:54 AM

అందరికీ ఒకే చోట అందజేస్తున్న పరిస్థితి

వృద్ధులనూ పంచాయతీ

కార్యాలయాలకు రప్పిస్తున్న సిబ్బంది

సర్కారు తీరుతో విస్తుపోతున్న

పింఛన్‌దారులు

వైఎస్సార్‌సీపీ హాయంలో ఉదయం 5 గంటలకే తలుపుతట్టి అందజేత

ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ ఇవ్వాలి

అందరినీ ఒకచోటకు పిలిచి పింఛన్లు పంపిణీ చేయకూడదు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేయాలి అలా ఎక్కడైనా అందజేయకపోతే చర్యలు తీసుకుంటాం.

– శ్రీనివాస పాణి, డీఆర్‌డీఏ పీడీ

ఒకేచోటకు రప్పించి అందజేత

ప్రస్తుత టీడీపీ సర్కార్‌ పింఛన్‌దారులను రచ్చబండ వద్దకు, పంచాయతీ కార్యాలయం వద్దకు, లేదా వీధిలో ఒకచోట కూర్చుని వారి వీధిలో ఉన్న పింఛన్‌ దారులందరినీ పిలిపించి అక్కడ ఇస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులను సైతం రప్పించుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఇబ్బందికరమైనా పింఛన్‌దారులకు తప్పని పరిస్థితి.

జిల్లాలో 2,68,072 ఫించన్లు

జిల్లాలో వివిధ కేటగిరిలకు చెందిన పింఛన్లు 2,68,072 ఉన్నాయి. వాటిలో వృద్ధాప్య 1,28,623, వితంతు 73,727, దివ్యాంగ 35, 538, అభయహస్తం 10,044, ఒంటరి మహిళలు 5,117, డప్పు కళాకారులు 4,005, చేనేత 2,844, గీతకార్మికులు 2,876, మత్య్సకారులు 2,129, చర్మకారులు 1548, డీఎంహెచ్‌ఓ 870, డయాలసిస్‌ 469,కళాకారుల 253, టాన్స్‌జెండర్స్‌ 26, సైనిక్‌ వేల్ఫేర్‌ పింఛన్లు 3 ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement