రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి.. | - | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి..

Jun 5 2026 12:54 AM | Updated on Jun 5 2026 12:54 AM

రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి..

గుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఇరిడి సెంటర్‌ సమీపంలో ఎదురెదురుగా వస్తున్నా ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జోళ్ల గూడ గ్రామానికి చెందిన ఎన్‌. జగన్‌, మరో వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇరిడి వెళ్తుండగా.. తోలుఖర్జ గ్రామానికి చెందిన పాలక సహదేవుడు గుమ్మలక్ష్మీపురం వస్తుండగా మార్గమధ్యంలో ఇరిడి గ్రామం దాటాక ఇరిడి సెంటర్‌ సమీపంలో రెండు వాహానాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో సహదేవుడు (46) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ద్విచక్ర వాహన చోడకుడు జగన్‌కు తీవ్ర గాయాలవడంతో భద్రగిరి ఆస్పత్రిలో చేర్చారు. ప్రథమ చికిత్స అనంతరం జగన్‌ను పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. కాగా సహదేవుడు మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం భద్రగిరి ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్విన్‌ పేట పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మరొకరికి గాయాలు

Advertisement
 
Advertisement
Advertisement