32 కిలోల గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

32 కిలోల గంజాయి స్వాధీనం

Jun 4 2026 7:09 AM | Updated on Jun 4 2026 7:09 AM

శృంగవరపుకోట: కారులో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని ఎస్‌.కోట పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు సీఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 2వ తేదీ మధ్యాహ్నం 3.30గంటల సమయంలో ఓ కారులో గంజాయితో వస్తున్నారన్న సమాచారంతో ఎస్సై చంద్రశేఖర్‌ తన సిబ్బందితో కలిసి నిఘా వేసి కారును నిలువరించారు. కారులో ఉన్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని సోదా చేయగా గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. గంజాయి తూకం వేయించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 32.485కిలోల గంజాయి కారులో ఉన్నట్లు నిర్ధారించారు.

నిందితులు కేరళ రాష్ట్రానికి చెందిన 53 యేళ్ల ముస్తఫా, 33యేళ్ల శరత్‌లాలాగా గుర్తించారు. రిమాండ్‌ నిమిత్తం నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ నారాయణమూర్తి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement