● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
తెర్లాం: చంద్రబాబు వెన్నుపోటు పాలనపై జిల్లాలోని అన్ని మండల, మున్సిపల్ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించనున్న పోరులో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను)పిలుపునిచ్చారు. తెర్లాం మండలంలోని వెలగవలస గ్రామంలో మండల వైస్ ఎంపీపీ చేపేన సత్యనారాయణ ఇంటివద్ద బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, పార్టీ మండల నాయకులతో ఆయన మాట్లాడారు. రెండేళ్లుగా చంద్రబాబు ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలు అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.


