నిరసన కార్యక్రమాలు ఇలా.. | - | Sakshi
Sakshi News home page

నిరసన కార్యక్రమాలు ఇలా..

Jun 3 2026 12:45 AM | Updated on Jun 3 2026 12:45 AM

కూటమి ప్రభుత్వం ప్రజలను వంచించి, మోసగించి గెలిచిన జూన్‌ 4న అన్ని మండల కేంద్రాలు, ప్రధాన కూడళ్లలో భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్సార్‌ విగ్రహాలకు నివాలులర్పించిన అనంతరం టీడీపీ మేనిఫెస్టో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సంతకాలు చేసిన బాండ్లు, పత్రికాప్రకటన కాపీలను దహనం చేస్తారు.

● ఈ నెల 8, 9వ తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో రెండేళ్ల కూటమి మోసకారి పాలనను వివరిస్తూ పెద్దఎత్తున ప్రజా అవగాహన సభలు నిర్వహిస్తారు.

● కూటమి ప్రభుత్వం అధికారంగా బాధ్యతలు చేపట్టిన జూన్‌ 12న రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలు నిర్వహిస్తారు. నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తల ఆధ్వర్యంలోను, మండల స్థాయిలో మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement