వైఎస్సార్‌ నగర్‌లో భారీ చోరీ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ నగర్‌లో భారీ చోరీ

Jun 2 2026 12:38 AM | Updated on Jun 2 2026 12:38 AM

● సుమారు 30 తులాల బంగారం అపహరణ

క్లూస్‌ టీమ్‌తో టూటౌన్‌ పోలీసుల దర్యాప్తు

విజయనగరం క్రైమ్‌: స్థానిక టూటౌన్‌ స్టేషన్‌ పరిఽధి వైఎస్సార్‌ నగర్‌లో ఫ్లాట్‌ నంబర్‌ 15 లో భారీ చోరీ జరిగింది. ఈ ఘటనలో సుమారు 30 తులాల బంగారం అపహరణకు గురైంది. చోరీ సొత్తు విలువ దాదాపు రూ.70 లక్షలకు పైగా ఉంటుంది. ఈ చోరీకి సంబంధించి స్థానికులు, ఫిర్యాదుదారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొట్టా వీరవెంకటస్వామి తన భార్య గౌరితో వైఎస్సార్‌ నగర్‌లోని శ్రీ సత్యనగర్‌లో 8 ఏళ్ల నుంచి సొంత ఇంటిలో ఉంటున్నారు. భార్య గౌరి ప్రభుత్వ ఉద్యోగినిగా పనిచేస్తుండగా వీర వెంకటస్వామి స్థానికంగా ఒక ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. వారి పిల్లలు ఉన్నత చదువుల కోసం పై ఊళ్లలో ఉండగా భార్యాభర్తలు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. ఈనెల 30న భార్యాభర్తలు అన్నవరం దర్శనానికి వెళ్లి 31న సాయంత్రానికి ఇంటికొచ్చి చూడగా ఇంటికి వేసిన తాళం పగలగొట్టి ఉంది. తలుపు తీసి చూడగా బీరువా తాళం తెరిచి ఉండడం, మాస్టర్‌ బెడ్‌రూంలోని మంచంపై చిందరవందరగా బీరువాలోని వస్తువులు కనిపించడంతో ఇల్లు గుల్ల య్యిందని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు టూటౌన్‌ సీఐ శ్రీనివాస్‌ తన ఐడీపార్టీ బృందంతో సోమవారం ఘటనా స్థలానికి వెళ్లి క్లూస్‌ టీమ్‌తో ఇల్లు మొత్తం ఆధారాలు సేకరించారు. అతి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ,పోయిన సొత్తు తిరిగి ఫిర్యాదుదారులకు అప్పగిస్తామని సీఐ శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

పెట్రోల్‌,డీజిల్‌ ధరల పెంపుపై వినూత్న నిరసన

విజయనగరం గంటస్తంభం: డ్రైవర్స్‌ డే సందర్భంగా ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీసేలా ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం వినూత్నరీతిలో నిరసన తెలిపారు. విజయనగరం కోట కూడలి వద్ద ఆటోలను తాళ్లతో లాగుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో శ్రీ కనకదుర్గ ఆటో వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు రెడ్డి శంకరరావు, సీఐటీయూ నగర కార్యదర్మి బి.రమణ, పాపారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement