జలధార – జలహారతితోనైనా.. సాగునీటి కష్టాలు తీరేనా..! | - | Sakshi
Sakshi News home page

జలధార – జలహారతితోనైనా.. సాగునీటి కష్టాలు తీరేనా..!

Jun 1 2026 1:02 AM | Updated on Jun 1 2026 1:02 AM

జలధార – జలహారతితోనైనా.. సాగునీటి కష్టాలు తీరేనా..!

జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న 7062 చెరువుల పనులు వెచ్చించనున్న నిధులు రూ.659.3 కోట్లు రూ.100.44 కోట్లతో చేపట్టనున్న 4801 ఫీడర్‌ చానల్స్‌, ఫీల్డ్‌ చానల్స్‌ పనులు దశాబ్ద్ద కాలంగా కళ్లెదుటే నీళ్లు.. అయినా తీరని సాగునీటి కష్టాలు పూర్తిగా శిథిలావస్థకు చేరిన పలు చెరువుల ప్రధాన మదుములు

మదుములు తక్షణమే బాగు చేయాలి..

సాగునీటి వనరుల సమర్ధ వినియోగమే లక్ష్యం..

రామభద్రపురం:

జిల్లాలో వేలాది ఎకరాల ఆయకట్టు ఆధారమై న చెరువులు, ఫీడర్‌ చానల్స్‌, ఫీల్డ్‌ చానల్స్‌ పూడికలు, ముళ్ల పొదలతో నిండిపోయాయి. మదుము లు, చెక్‌డ్యాంలు పూర్తిగా శిథిలావస్థకు చేరి అధ్వానంగా తయారయ్యాయి. దాదాపు దశాబ్ద కాలంగా వాటి నిర్వహణ ఊసే లేకుండా పోయింది. 2014 – 19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం నీరు చెట్టు పథకం కింద ఉపాధి హామీ నిధులతో కొన్ని చోట్ల మదుములు, చప్టాలు, చెక్‌డ్యాంల పనులు చేయకుండానే చేసినట్టు, మరికొన్ని చోట్ల పనులు నాసిరకంగా చేసి రూ.కోట్ల నిధులు అప్పట్లో ఆయా నాయకులు అక్రమాలకు పాల్పడినట్టు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. ఉపాధి హామీ పథకం కింద చెరువు పనులు చేసినా తూతూ మంత్రంగానే తప్ప రైతులకు ఉపయోగపడేలా చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. మదుముల దుస్థితి చూస్తే సాగునీరు సరఫరా అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. చెరువులలోని సాగునీటిని పంట పొలాలు మీదుగా చెరువులకు చేరుస్తూ నీటితో కళకళలాడాల్సిన పంట కాల్వలు నేడు మురుగు కాల్వలను తలపిస్తున్నాయి. 5–6 అడుగుల లోతులో ఉండాల్సిన సాగునీటి కాల్వలు వ్యర్థాలు, చెత్త చెదారంతో పూ ర్తిగా నిండిపోయాయి. ప్రస్తుతం ఈ కాల్వలు ముళ్లపొదలు, చిన్న చిన్న చెట్లు, వ్యర్థాలతో నిండిపోయి అడవిని తలపిస్తున్నాయి. వ్యర్థాలతో పూర్తిగా పూడి కపోయాయి. కనీసం నీటి చుక్క వెళ్లే మార్గం లేదు. కొద్ది నెలల క్రితం కూటమి ప్రభుత్వంలో అధికారు లు పూర్తిగా పోయిన వాటికి ప్రతిపాదనలు పంపించినా అవి ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. దాంతో ఖరీఫ్‌ సీజన్లో వర్షాలు పడి చెరువుల నిండి నా చెరువులకు సంబంధించిన ఆయకట్టు పండేలా కనిపించడం లేదు. చెరువుల్లో కళ్ల ముందు నీరు ఉన్నా రైతులు పంటలకు సరఫరా చేసే అవకాశం లేక నానా ఇబ్బందులు పడుతూ పూర్తిగా వరి సాగు వదిలేసి వర్షాధార పంటలు, ఆరు తడి పంటలైన కూరగాయలు, పత్తి సాగు చేసుకుంటున్నారు.

జలధార – జలహారతితోనైనా

సాగునీటి కష్టాలు తప్పేనా..

ఇప్పుడు కూటమి ప్రభుత్వం జలవనరుల సంరక్ష ణ, అభివృద్ధి, సాగునీటి వనరుల సమర్ధ వినియో గం లక్ష్యంగా జలధార – జలహారతి కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చింది. అందులో భాగంగా జిల్లాలో ఉపాధి హామీ పథకం నిధులు రూ.659.3 కోట్లతో 7062 చెరువులు, రూ.100.44 కోట్లతో 4801 ఫీడర్‌ చానల్స్‌, ఫీల్డ్‌ చానల్స్‌ తదితర ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. వాగులు, వంకలు, చెరువులను శుభ్రం చేసి భూగర్భ జల మట్టాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆయకట్టుకు ఉపయోగ పడేలా చెరువులు, ఫీల్డ్‌ చానల్స్‌, ఫీడర్‌ చానల్స్‌లో పూడికతీత, పనులతో పాటు మదుములు, చెక్‌ డ్యాంలు నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టేందుకు వెసులుబాటు ఉంది. వర్షాలు పడక ముందే కాలువ ల్లో నిండిపోయిన తుప్పలు, డొంకలు, పూడికలు, మదుముల ఆధునీకరణ తదితర పనులు ఉపాధి హామీ ద్వారా చేపడితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నా రు. జలధార – జలహారతితో రైతులకు సాగునీటి కష్టాలు ఎంత మేరకు తీరుతాయో వేచి చూడాలి.

మడకవాని చెరువుకు సంబంధించి రెండు, వెంకయ్యబందకు సంబంధించి రెండు మదుములు పూర్తిగా కుంగిపోయి పాడైపోయాయి. ఎనిమిదేళ్లుగా సాగు నీటికి అవస్థలు పడుతున్నాం. అలాగే ఆ చెరువుకు ఆధారంగా ఉన్న పంట కాలువలు పూర్తిగా తుప్పలు, డొంకలు, వ్యర్థాలతో పూడికపోయాయి. అధికారులు వెంటనే బాగు చేయకపోతే ఆయకట్టు పంట పొలాలకు సాగు నీరు అందే పరిస్థితి లేదు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా పరిస్థితిలో మార్పులేదు. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన బాగు చేయించాలి.

– చొక్కాపు పైడిపునాయుడు, రైతు,

రామభద్రపురం

జలవనరుల సంరక్షణ, అభివృద్ధి, సాగునీటి వనరుల సమర్ధ వినియోగమే లక్ష్యం. జలధార–జలహారతి కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ నిధులతో చెరువుల అభివృద్ధ్ది, ఫీడర్‌ చానల్స్‌, ఫీల్డ్‌ చానల్స్‌, మదుముల ఆధునీకరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ పనులన్నీ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. – ఎస్‌.శారదా దేవి, డ్వామా పీడీ

Advertisement
 
Advertisement
Advertisement