ఇలాగైతే.. ఎలా...! | - | Sakshi
Sakshi News home page

ఇలాగైతే.. ఎలా...!

Jun 1 2026 1:02 AM | Updated on Jun 1 2026 1:02 AM

ఇలాగైతే.. ఎలా...!

ఇలాగేనా... పిల్లల సంరక్షణ..!

అంగన్‌వాడీ కేంద్రాల్లో

కనీస సదుపాయాలు కరువు

తాగునీరు, మరుగుదొడ్లు లేక

చిన్నారుల అవస్థలు

జిల్లాలో 2499 అంగన్‌వాడీ కేంద్రాలు

292 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు

20,314 మంది పిల్లలు

పనులు సాగుతున్నాయి..

విజయనగరం ఫోర్ట్‌:

జిల్లాలోని అనేక అంగన్‌వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలైన తాగునీరు, మరుగుదొడ్డి లేక చిన్నారు లు అవస్థలు పడుతున్నారు. సీ్త్ర, శిశు సంక్షేమానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు ప్రభు త్వం గొప్పలు చెబుతుంది. కానీ జిల్లాలో పదుల సంఖ్యలో అంగన్‌వాడీ కేంద్రాల్లో వాస్తవ పరిస్థితి ప్రభుత్వం చెబుతున్నదానికి పూర్తి భిన్నంగా ఉంది. ఈ కేంద్రాలకు చిన్నారులతో పాటు బాలింతలు, గర్భిణులు కూడా వెళ్లి వస్తుంటారు. ప్రభుత్వం అందజేసే పలు రకాల పౌష్టికాహార పదార్ధాలు తీసుకునేందుకు గర్భిణులు, బాలింతలు వెళ్తుండగా.. చిన్నారులు పగటి పూటంతా అక్కడే ఉంటారు. మ రి ఇటువంటి కేంద్రాల్లో ఎటువంటి సదుపాయాలు ఉండాలి? కానీ ఆ దిశగా ప్రభుత్వం కనీసం ఆలోచించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వసతు ల లేమితో ఈ కేంద్రాలో అధ్వాన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవ డం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో ఇలా..

జిల్లాలో 11 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. బాడంగి, భోగాపురం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, గంట్యాడ, గరివిడి, రాజాం, ఎస్‌.కోట, వియ్యంపేట, విజయనగరం ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 2499 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నా యి. 292 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాలు 2207 ఉన్నాయి. వీటి పరిధిలో 7,652 మంది గర్భిణులు, 7,284 మంది బాలింతలు, ఆరు నెలల్లోపు పిల్లలు 6625 మంది ఉన్నారు. 7 నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు 35,630 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 20,314 మంది ఉన్నారు.

సౌకర్యాల్లేక చిన్నారుల అవస్థలు

అంగన్‌వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు లేకపోవడం వల్ల చిన్నారులు అవస్థలు పడుతున్నారు. మరుగుదొడ్లు లేకపోవడం వల్ల బహిరంగ మల, మూత్ర విసర్జన చేస్తున్నారు. బహిరంగ మల, మూత్ర విసర్జన వల్ల టైఫాయిడ్‌, డయేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అయినప్పటకీ చిన్నారులకు తప్పనిసరి పరిస్థితి. పిల్లలకు సురక్షితమైన తాగునీరు కూడా అందివ్వడం లేదనే విమర్శలు లేకపోలేదు.

నిర్మాణంలోనూ అలసత్వమే..

అంగన్‌వాడీ కేంద్రాలకు మంజూరైన మరుగుదొడ్లు నిర్మాణంలోనూ అలసత్వం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలకు 538 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇందులో 366 మరుగుదొడ్లు పూర్తయ్యాయి. 139 నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణం పూర్తయిన మరుగుదొడ్లును కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురాలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరుగుదొడ్లు లేని అంగన్‌వాడీ కేంద్రాలకు వీటిని నిర్మిస్తున్నాం. జిల్లాలో చాలా వరకు నిర్మాణం పూర్తయ్యాయి. నిర్మాణంలో ఉన్న వాటిని త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ భవనాల్లో నిర్వహి స్తున్న 566 అంగన్‌వాడీ కేంద్రాలకు కుళాయి కనెక్షన్లు మంజూరయ్యాయి. 388 కేంద్రాల్లో కుళాయి కనెక్షన్లు ఇచ్చాం. మిగతా కేంద్రాలకు ఈ కనెక్షన్లు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాం. కేంద్రాల్లో కనీస సదుపాయాలు కల్పిస్తున్నాం.

– కె.వి.బాలామణి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ సాధికారిత అధికారిణి

Advertisement
 
Advertisement
Advertisement