రెటీనా ప్రవేశ పరీక్షలో జాతీయస్థాయిలో డాక్టర్‌ ఆశిష్‌ ప్రథమం | - | Sakshi
Sakshi News home page

రెటీనా ప్రవేశ పరీక్షలో జాతీయస్థాయిలో డాక్టర్‌ ఆశిష్‌ ప్రథమం

Jun 1 2026 1:02 AM | Updated on Jun 1 2026 1:02 AM

రెటీనా ప్రవేశ పరీక్షలో జాతీయస్థాయిలో డాక్టర్‌ ఆశిష్‌ ప్రథమం

బొబ్బిలి: పట్టణానికి చెందిన సుంకర పల్లి ఆశిష్‌ చండీగఢ్‌ యూనివర్సిటీ నిర్వహించిన ఎంసీహెచ్‌ రెటీనా ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించినట్లు ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్‌ కేవీ అప్పారావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం స్థానిక కంటి ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది అరుదైన విషయమన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన ఈ ప్రవేశ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడం అబ్బుర పరిచిందన్నారు. చండీగఢ్‌ యూనివర్సిర్శిటీలో గోల్డ్‌మెడల్‌ సాధించి బీజేఓ, ఏఏఓ వంటి జర్నల్స్‌లో 15కు పైగా పరిశోధనా వ్యాసాలు రాసిన ఘనత ఆశిష్‌ సొంతమన్నారు. దక్షిణభారత దేశం నుంచి ఎంసీహెచ్‌ రెటీనాలో ఈ ర్యాంకు ద్వారా సీటు సాధించిన అభ్యర్థులలో ఆశిష్‌ మొదటి వ్యక్తి అని ప్రశంసించారు.

ఆగస్టులో జాతీయ స్థాయి నేత్ర వైద్య సంస్థ ప్రారంభం:

బొబ్బిలి పట్టణంలోని రైల్వే స్టేషన్‌ జంక్షన్‌లో జాతీయ స్థాయి నేత్ర వైద్య సంస్థను ఆగస్టు 13న ప్రారంభించనున్నట్లు డాక్టర్‌ కేవీ అప్పారావు తెలిపారు. ప్రస్తుతం చివరి నిర్మాణ దశలో ఉన్న ఈ వైద్య సంస్థకు డాక్టర్‌ ఎస్‌.ఆశిష్‌, డాక్టర్‌ విజయలు సారథ్యం వహిస్తారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement