కలెక్టర్‌ గారూ కనికరించండి..! | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ గారూ కనికరించండి..!

May 31 2026 1:00 AM | Updated on May 31 2026 1:00 AM

చిత్రంలో ఖాళీ బిందెలతో నిల్చుని దండాలు పెడుతున్న గిరిజనులు ఎస్‌.కోట మండలం ధారపర్తి పంచాయతీ పరిధిలోని పల్లపు దుంగాడ వాసులు. కుళాయిల నుంచి తరచూ తాగునీరు సరఫరా కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. శనివారం కూడా చుక్కనీరు రాకపోవంతో ఖాళీ బిందెలతో నిల్చొని దండాలు పెడుతూ ‘కలెక్టర్‌ సారూ కనికరించండి.. తాగడానికి నీళ్లు ఇప్పించండి.. చలమల నీళ్లు తాగి రోగాల పాలవుతున్నాం.. కుళాయిలు వేశారు.. బిల్లులు చేసుకున్నారు.. నిధులు మింగేశారు. మమ్మల్ని గాలికొదిలేశారు’ అంటూ గోడువినిపించారు.

– శృంగవరపుకోట

Advertisement
 
Advertisement
Advertisement