విజయనగరం క్రైమ్: గంజాయి రవాణాకు చెక్ పెట్టి జిల్లాను గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు రెవెన్యూ, పోలీస్ అధికారులు సమష్టిగా పనిచేయాలని సూచించారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఫనార్కోటిక్ కో ఆర్డినేషన్ కమిటీ (ఎన్సీఓఆర్డీ) సమావేశాన్ని జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి వినియోగం చాలా వరకు తగ్గిందని.. ఒడిశా, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. గంజాయికి బానిసలైన వారిని గుర్తించి డీ అడిక్షన్ సెంటర్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు. సమావేవంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఈగల్ ఎస్సై స్వీటీ పాల్గొన్నారు.
బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు
విజయనగరం క్రైమ్: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ ముఠాలపై నిఘాపెట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. యువత మొబైల్ ఫోన్‌లను తనిఖీ చేసి బెట్టింగ్ యాప్‌లను తొలగించాలన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి, చదువుపై దృష్టి సారించాలని సూచించారు.
ఎస్పీ ఏఆర్ దామోదర్


