చెరువుల పరిరక్షణే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

చెరువుల పరిరక్షణే ధ్యేయం

May 31 2026 1:00 AM | Updated on May 31 2026 1:00 AM

చెరువుల పరిరక్షణే ధ్యేయం

పార్వతీపురం రూరల్‌: జిల్లాలోని చెరువుల పరిరక్షణ, పారిశుధ్య నిర్వహణే ధ్యేయంగా యంత్రాంగం పనిచేస్తోందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. ప్రభాకరరెడ్డి తెలిపారు. శనివారం ఆయన స్థానిక శివాలయం చెరువు వద్ద సాగుతున్న ‘ఆపరేషన్‌ క్లీన్‌స్వీప్‌’ పనులను, నూతనంగా అందుబాటులోకి వచ్చిన వాకింగ్‌ ట్రాక్‌ను పరిశీలించి, ప్రగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు పడనున్న నేపథ్యంలో పట్టణ పరిధిలోని డ్రెయిన్లు, వరద నీటి కాలువల్లో పూడికతీత పనులు చేపడుతున్నట్లు చెప్పారు. భూగర్భ జలాలు అడుగంటిపోకుండా వర్షపు నీటిని సంరక్షించుకోవాలని ప్రజలకు సూచించారు. అనంతరం జల వనరుల సంరక్షణపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో స్థానికులు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ పావని, మెప్మా పీడీ నాగభూషణరావు, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు వానాది శ్రీహరి, మున్సిపల్‌, సచివాలయ అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ప్రభాకర రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement