బ్రాయిలర్
లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్
శ్రీ130 శ్రీ230 శ్రీ240
చికెన్
రాజాం సిటీ: పట్టణంలోని పాతబస్టాండ్ ఎదురుగా ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. కార్యాలయంలో పనిచేస్తున్న సబ్ డివిజనల్ ఇంజినీరు పంచాది వెంకటప్రసాద్ శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో కార్యాలయానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. యథావిధిగా శనివారం ఉదయం ఆయన విధులకు రాగా తాళాలు బద్దలుగొట్టి ఉండడాన్ని చూసి, ఆఫీస్ గదిలో పరిశీలించారు. ఆ గదిలో 20 బ్యాటరీలు, రాగి వైరు, ఒక మొబైల్ అపహరణకు గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. 35 వేల విలువగల సామగ్రిని దొంగిలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. క్లూస్‌టీమ్ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు.


