● కలెక్టర్‌ను ఆదేశించిన పరిశ్రమలు,
వాణిజ్య శాఖ సెక్రటరీ యువరాజ్
విజయనగరం అర్బన్: జిల్లాలోని ఎస్.కోట మండల పరిధిలో నిర్మించనున్న ‘మెసర్స్ జేఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ లిమిటెడ్’ శంకుస్థాపనకు ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని ఏపీ పరిశ్రమలు, వాణిజ్య శాఖ సెక్రటరీ డాక్టర్ ఎన్.యువరాజ్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్‌లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్కుకు సంబంధించిన ప్రస్తుత ప్రగతి, భూసేకరణ, మౌలిక వసతుల కల్పనపై ఆరా తీశా రు. ఈ సందర్భంగా పారిశ్రామిక పార్కుకు సంబంధించిన నివేదికను, ఇప్పటివరకు సాధించిన పురోగతిని సెక్రటరీకి వివరించారు. భూసేకరణ ప్రక్రియ, మౌలిక వసతుల కల్పన పనులను మరింత వేగవంతం చేస్తామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


