అంధకారంలో విజయనగరం | - | Sakshi
Sakshi News home page

అంధకారంలో విజయనగరం

May 30 2026 8:35 AM | Updated on May 30 2026 8:35 AM

విద్యుత్‌ సరఫరా లేక అంధకారంలో

ఎలుగుబంటి వారి వీధి

డీసీసీబీ బ్యాంక్‌ వద్ద రాత్రి సమయంలో ఇలా..

విజయనగరంలో రెండు రోజులుగా అంధకారం అలుముకుంది. విద్యుత్‌ సరఫరా లేక పలు వీధులు, కాలనీల ప్రజలు ఉదయం భగ్గుమంటున్న ఎండలు, వడగాడ్పులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాత్రివేళ చీకటిలో మగ్గుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు నరకయాతన పడుతున్నారు. ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసి రెండు రోజులవుతున్నా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా పాలనా యంత్రాంగం నిద్ర మేల్కొని, పలు ప్రాంతాల్లో విరిగిపడిన విద్యుత్‌ స్తంభాలను సరిచేసి, తక్షణమే అంధకారాన్ని తొలగించి వెలుగులు నింపాలని వినియోగదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

– సాక్షిఫొటోగ్రాఫర్‌, విజయనగరం

Advertisement
 
Advertisement
Advertisement