ఎన్నో అక్రమాలు, అవకతవకలతో నిర్వహించిన మెగా డీఎస్సీతో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగింది. దీనికి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాధ్యత వహించాలి. తన పదవికి రాజీనామా చేయాలి. అనర్హులు మెరిట్ జాబితాలో ముందుండం శోచనీయం. మెగా డీఎస్సీ అని ఉద్యోగాలు అమ్మేసుకుంటారా? ఇదేనా మీ ప్రభుత్వం తీరు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం.
– బమ్మిడి కార్తీక్,
చీపురుపల్లి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ విద్యా విభాగం అధ్యక్షుడు


