విజయనగరం అర్బన్: పింఛన్ల పంపిణిలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించడం ద్వారా ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని పెంపొందించాలని సూచించారు. జిల్లాలో పింఛన్ల పంపిణీ ప్రతి నెలా సజావుగా జరుగుతున్నప్పటికీ, సానుకూల ప్రజాభిప్రాయం విషయంలో జిల్లా వెనుకబడి ఉండడంపై కలెక్టర్ విశ్లేషించారు. పింఛన్లు ఇళ్ల వద్దకు వెళ్లే ఇవ్వాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలతో మ ర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు.
సకాలంలో పారిశ్రామిక ప్రాజెక్ట్‌లు..
జిల్లాకు మంజూరైన పరిశ్రమలు, పారిశ్రామిక ప్రాజెక్ట్‌లను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడానికి సంబంధిత శాఖలన్నీ పూర్తి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందింరలో రెవెన్యూ, పరిశ్రమల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల పెంపు దిశగా చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు.
కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి


