రైల్వేకు ఆదాయం పులుపు..! | - | Sakshi
Sakshi News home page

రైల్వేకు ఆదాయం పులుపు..!

May 29 2026 10:14 AM | Updated on May 29 2026 10:14 AM

రైల్వేకు ఆదాయం పులుపు..!

ఉన్నతాధికారులకు

నివేదించాం

కనుమరుగవుతున్న మామిడి

ఎగుమతులు

గత మూడేళ్లుగా ఇదే తంతు

కిసాన్‌ రైళ్లపై దృష్టిసారించని

యంత్రాంగం

వ్యాపారస్తులతో తూతూ మంత్రంగా చర్చలు

ఉన్నతాధికారులకు నివేదించాం: కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌

విజయనగరం టౌన్‌:

రైల్వేశాఖకు ఏటా కోట్లాది రూపాయలు ఆదాయం తెచ్చిపెట్టే మామిడి పండ్ల ఎగుమతులు మూడేళ్లుగా కానరావడం లేదు. కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైల్వే ఆదాయానికి గండి పడుతోందన్న విమర్శలు వినిపిస్తు న్నాయి. మ్యాంగో అసోసియేషన్‌లతో తూతూ మంత్రంగా చర్చలు నిర్వహించడం, వ్యాపారస్తులకు అనుకూలంగా సమాధానం లేకపోవడంతో వారంతా ప్రత్యామ్నాయ మార్గాల్లో పంటను ఎగుమతి చేస్తున్నారు. గతంలో కిసాన్‌రైళ్లను ఏర్పాటుచేసి ఎగుమతులకు రాయితీలు ఇవ్వడంతో రైతులకు ప్రయోజనకరంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో రైల్వేకు ఆదాయం తగ్గింది.

ఎగుమతులు ఇలా..

ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే పరిధిలో విజయనగరం జిల్లా కేంద్రంగా మామిడి పంటను ఢిల్లీకి ఏటా ఎగుమతి చేస్తారు. కోవిడ్‌ తర్వాత 2022లో కేవలం 7 రైళ్లలో 2016 టన్నులకే పరిమితమై రూ. 88,30,340 ఆదాయం చేకూరింది. అయితే, 2023లో మామిడి దిగుబడులు బాగుండడం, రైతులు, మ్యాంగో అసోసియేషన్‌లు ముందుకు రావడంతో రైల్వేశాఖకు ఆదాయం గణనీయంగా పెరిగింది. సుమారు 25 రైళ్లలో సుమారు 8,234 టన్నుల మామిడి ఎగుమతులు చేశారు. రైల్వేశాఖకు అప్పట్లో సుమారు రూ.3,70,50,370ల ఆదాయం సమకూరింది.

కోవిడ్‌లోనూ ఎనలేని సేవలు

కోవిడ్‌–19 సమయంలోనూ ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే

కిసాన్‌ రైళ్లు లేకపోవడంతో సంబంధిత మ్యాంగో అసోసియేషన్‌లు మామిడి ఎగుమతులకు ముందుకు రావడం లేదు. రాయితీతో కూడిన ఎగుమతులు కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. వారితో సంప్రదింపు లు చేసినా ఫలితం లేకుండా పోయింది. విజ యనగరం జిల్లాలో ఉన్న రెండు అసోసియే షన్‌లతో చర్చించాం. వారు చెప్పిన డిమాండ్‌లను ఉన్నతాధికారులకు నివేదించాం.

– బి.వి.సత్యనారాయణ,

చీఫ్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌, విజయనగరం

తమ విలువైన సేవలను అందిస్తూ రైతుల మన్ననలు అందుకుంది. విజయనగరం పరిధిలో కోవిడ్‌ స్పెషల్స్‌లో 2020 మార్చి నెల నుంచి ఆగస్టు చివరి వరకూ 4,330 టన్నుల మామిడి ఉత్పత్పులను 20 కోవిడ్‌ స్పెషల్‌ రైళ్లలో ఎగుమతి చేసింది. వీటి ఎగుమతుల వల్ల రైల్వేకు 1,88,10,343ల ఆదాయం వచ్చింది. పార్సిల్స్‌ ద్వారా 5,615 క్వింటాళ్లను రవాణాచేసి రూ. 7,27,816లు, 139 క్వింటాళ్ల లగేజీ ద్వారా రూ.54,648 ఆదాయం సమకూరింది. 2021లో 30 రైళ్లతో 10,379 టన్నుల మామిడి ఎగుమతుల వల్ల రూ.4 కోట్లకి పైగా ఆదాయం వచ్చింది. 2022లో కేవలం 7 రైళ్లతో 2016 టన్నుల ఎగుమతులు చేసి రూ.88 లక్షల ఆదాయమే సమకూరింది. 2023లో సుమారు 25 రైళ్లలో సుమారు 8,234 టన్నుల మామిడి ఎగుమతులు చేసి రూ.3 కోట్లకి పైగా ఆదాయం రైల్వేశాఖ ఆర్జించింది. అంతే నాటి నుంచి నేటివరకూ ఎగుమతులు లేకపోవడం బాధాకరం.

Advertisement
 
Advertisement
Advertisement