● పది మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలి ● యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 5 వేల అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి ● జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్‌ లక్ష్మణరావు డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

● పది మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలి ● యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 5 వేల అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి ● జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్‌ లక్ష్మణరావు డిమాండ్‌

May 29 2026 10:14 AM | Updated on May 29 2026 10:14 AM

● పది మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలి ● యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 5 వేల అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి ● జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్‌ లక్ష్మణరావు డిమాండ్‌ షట్టర్ల ఏర్పాటు ప్రాంతీయ సమతుల్యతతోనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి

సంతకవిటి: మండలంలోని రంగారాయపురం వద్ద ఉన్న నారాయణపురం ఆనకట్ట నుంచి కుడి, ఎడమ ప్రధాన కాలువలకు సాగునీటి మళ్లింపునకు వీలుగా షట్టర్లు ఏర్పాటుచేస్తున్న ట్టు డీఈ వై.రవీంద్రనాయుడు గురువారం తెలిపారు. విజయనగరం జిల్లా సంతకవిటి, శ్రీకాకుళం జిల్లా పొందూరు, ఆమదాలవలస, ఎచ్చెర్ల, బూర్జ మండలాల్లో వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు వీలు గా 118 షట్టర్లలో పూర్తిగా పాడైన 33 షట్టర్లను తొలగించి కొత్తవి ఏర్పాటుచేస్తున్నామన్నారు.

విజయనగరం అర్బన్‌: ప్రాంతీయ సమతుల్యతతోనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని, తక్షణమే ఉత్తరాంధ్ర, రాయలసీ మ ప్రాంతాల్లోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్‌.లక్ష్మణరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక జెడ్పీ మినిస్టీరియల్‌ భవనంలో గురువారం ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జేవీవీ దేవ్యాప్తంగా చేపట్టిన ‘ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నాయకత్వ శిక్షణా శిబిరాన్ని నిర్వహించినట్టు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న ‘వికసిత భారత్‌, స్వర్ణాంధ్ర’ నినాదాలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. దేశం, రాష్ట్రం నిజమైన ప్రగతి సాధించాలంటే నీటి పారుదల రంగంపై ప్రత్యే క దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వెలి గొండ ప్రాజెక్టుకు కూటమి ప్రభత్వం కనీస ని ధులు కేటాయించకపోవడం దారుణమన్నారు.

●పేదలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం గతంలో ఏర్పాటు చేసిన పది ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రస్తుత కూటమి ప్రభు త్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఈ ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని, వీటికి రూ.6 వేల కోట్లు కేటాయించి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించేలా చూడాలని డిమాండ్‌ చేశారు.

●రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయని లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలోని 24 యూనివర్సిటీల్లో దాదాపు 5 వేల అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని కోరారు. సమావేశంలో జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌, జిల్లా అధ్య క్షుడు ఎంవీఎన్‌ వెంకటరావు, కార్యదర్శి ప్రభాత పట్నాయక్‌, సమత కన్వీనర్‌ జి.నిర్మల పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement