ప్రశాంతంగా బక్రీద్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా బక్రీద్‌

May 29 2026 8:22 AM | Updated on May 29 2026 8:22 AM

ప్రశాంతంగా బక్రీద్‌

ఊపిరి పీల్చుకున్న నగరం

విజయనగరం క్రైమ్‌ : బక్రీద్‌ ను పండగను ముస్లింలు గురువారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వన్‌ టౌన్‌ స్టేషన్‌ పరిధి కంటోన్మెంట్‌ గంజిపేట రెల్లి వీధి రోడ్‌ లో ఉన్న మసీద్‌ లో ముస్లింలు కుటుంబ సమేతంగా ఉదయం 6.15గంటలకే నమాజ్‌లు పూర్తి చేసుకున్నారు. పండగ సందర్భంగా ఎలాంటి అలర్లు, ఘర్షణలు జరగకుండా వన్‌ టౌన్‌ సీఐ ఆర్వీఆర్‌కేచౌదరి, ఎస్సైలు లక్ష్మీ ప్రసన్నకుమార్‌, సురేంద్ర నాయుడు, రవి, కమల్‌భార్గవ్‌లు అన్ని మసీదులు, దర్గాల మద్ద బందోబస్తు నిర్వహించారు. ముందస్తుగా అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో బక్రీద్‌ ను ముస్లింలు ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకున్నారని వన్‌ టౌన్‌ సీఐ ఆర్వీ.కే.చౌదరి అన్నారు.ఒక రోజు ముందే ఎస్పీ అన్ని మసీద్‌ లున్న ప్రాంతాలను పరిశీలించి గట్టి బందోబస్తు సూచనలు ఇచ్చిన కారణంతో బక్రీద్‌ ప్రశాంత వారణంలో జరిగిందన్నారు.ముస్లింలు పోలీస్‌శాఖ కు సహకరించారని సీఐ చౌదరి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement