లక్కవరపుకోట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది. అధికారంలోకి వచ్చిన వెంటనే కళాశాలను ఏర్పాటుచేస్తామని సోంపురం కూడలి సమీపంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఇది జరిగి రెండేళ్లు గడిచినా కళాశాల మాత్రం ఎండమావిగానే మారింది. ఎల్.కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కళాశాల కోసం కేటాయించిన నాలుగు తరగతి గదులు నిరుపయోగంగా మారాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. లోక్‌శ్ మాట ఇచ్చినా నెరవేర్చలేకపోయారంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు.
– లక్కవరపుకోట


