వడదెబ్బతో గుర్తుతెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో గుర్తుతెలియని వ్యక్తి మృతి

May 28 2026 2:28 AM | Updated on May 28 2026 2:28 AM

వడదెబ్బతో గుర్తుతెలియని వ్యక్తి మృతి

పార్వతీపురం రూరల్‌: స్థానిక టౌన్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో వడదెబ్బ తగిలి ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. మృతదేహాన్ని ప్రస్తుతం పార్వతీపురం ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుని మృతుడిని గుర్తించడంలో సాయపడాలని పోలీసులు కోరారు. సదరు వ్యక్తి ఆచూకీ లేదా ఇతర వివరాలు ఏమైనా తెలిసిన వారు వెంటనే పార్వతీపురం టౌన్‌ పోలీస్‌స్టేషనన్‌లో కానీ, ఫోన్‌ 9121109467 నంబర్‌ను కానీ సంప్రదించి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement