కోళ్లఫారాన్ని సందర్శించిన అధికారులు | - | Sakshi
Sakshi News home page

కోళ్లఫారాన్ని సందర్శించిన అధికారులు

May 27 2026 10:20 AM | Updated on May 27 2026 10:20 AM

కోళ్లఫారాన్ని సందర్శించిన అధికారులు

వీరఘట్టం: ఎండతీవ్రత, విద్యుత్‌ కోతలతో వీరఘట్టం సమీపంలోని అచ్చెపువలస వద్ద ఉన్న కోళ్ల పారంలో 1200 కోళ్లు మృతి చెందినట్లు మంగళవారం సాక్షిలో ప్రచురితమైన ‘కోళ్లను బలికొన్న పవర్‌కట్‌’ కథనంపై అధికార యంత్రాంగం స్పందించింది. విద్యుత్‌శాఖ అధికారులు కోళ్ల ఫారాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.అలాగే పాలకొండ పశు శంవర్థకశ ఎ.డి పి.మాణిక్యరావు, వీరఘట్టం పశువైద్యాధికారి చైతన్యశంకర్‌లు అచ్చెపువలస వద్ద ఉన్న కోళ్ల ఫారాన్ని పరిశీలించారు. ఎండల తీవ్రత వల్లే కోళ్లు మృతి చెందినట్లు నిర్ధారించారు.అనంతరం ఫారం యజమాని మర్రి సురేష్‌తో మాట్లాడారు.కరెంటు కోత ఉన్నట్లు సమాచారం లేదని, కరెంటు తీస్తారని ముందుగా తెలిస్తే జనరేటర్‌ ఏర్పాటు చేసుకునే వాడినని బాధితుడు తన ఆవేదనను అధికారుల వద్ద తెలియజేశాడు. అయితే మంగళవారం తెల్లవారేసరికి సుమారు 2 వేలకు పైగా కోళ్లు మృతి చెందినట్లు గుర్తించారు. తనకు పరిహారం వచ్చేలా అధికారులు చొరవచూపాలని బాధితుడు కోరాడు. అనంతరం మృతి చెందిన కోళ్లను పెద్ద గొయ్యితీసి పాతిపెట్టారు.

సురేష్‌ను ఆదుకోవాలి

ఒకరిపై ఆధారపడకుండా స్వశక్తితో కోళ్ల ఫారం నడుపుతున్న నిరుద్యోగి మర్రి సురేష్‌ ఫారంలో వేల సంఖ్యలో కోళ్లు చనిపోవడం చాలా బాధాకరమని మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అతనికి ఇంత పెద్ద ఎత్తున నష్టం వచ్చిందన్నారు.ట్రాన్స్‌కో అధికారులు బాధితుడికి నష్టపరిహారం చెల్లించాలని కళావతి డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement